రాంచీ టెస్ట్ మ్యాచ్: వర్షం కారణంగా నిలిచిన ఆట

  • సెంచరీతో చెలరేగిన రోహిత్ ..117 పరుగులతో బ్యాటింగ్
  • రహానే 83 బ్యాటింగ్ 
  • 12 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా సాగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఆట టీ విరామం తర్వాత వర్షం రావడంతో నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు. ఓపెనర్ రోహిత్ శర్మ 117 పరుగులు, అజింక్య రహానే 83 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, పుజారా డకౌట్ కాగా కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నోర్ట్ జె బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా ఔటయ్యాడు.
Go Back to Shorts
INDvsSA
Cricket
India
south africa

More Telugu News